Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పిల్లల పేరున వీలునామా రాసేసి సూసైడ్ చేసుకోవాలనుకున్నా: యమున

  • ఆ నిందను భరించలేకపోయాను 
  • సూటిపోటి మాటలను తట్టుకోలేకపోయాను
  • అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను
కొంతకాలం క్రితం యమున ఓ బలమైన నిందను ఎదుర్కొంది. ఆ నింద కారణంగానే ఆమె నటనకు కూడా దూరమైంది. "అలాంటి పరిస్థితుల్లో పిల్లలకు వీలునామా రాసేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట .. నిజమేనా?" అనే ప్రశ్న ఆమెకు ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. అప్పుడామె స్పందిస్తూ .. " నిజమే .. మా వైపు న్యాయం వుంది అని మా లాయర్ చెబుతున్నాడు. అయితే ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికాను నేను .. ఇప్పుడు ఈ పెయిన్ తో బ్రతకాలా?" అనిపించింది.

 "ఇండస్ట్రీలో కూడా నన్ను ఫైర్ బ్రాండ్ అనేవారు .. ఇంట్లోను అదే పేరు. న్యాయంగా లేకపోతే నాతో మాట్లాడి గెలవలేం అనేవారు. అంత నిజాయితీగా బతికిన నాకు సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ల మధ్య నేను బతకాలా? నా కొద్దు ఈ లైఫ్ అనిపించింది. నా పెయిన్ ను నా పిల్లలకు ఇవ్వదల్చుకోలేదు .. నేను లేకపోతే వాళ్లు బాగుంటారు అనుకున్నాను. వాళ్ల పేరున వీలునామా రాయాలనుకుంటున్నట్టుగా నా సన్నిహితురాలికి చెప్పాను. ఆమెకి విషయం అర్థమై "ఎన్ని కష్టాలు ఎదురైనా నీ పిల్లల కోసం నువ్ బతకాల్సిందే" అంది. "ఆ మాటే నా నిర్ణయాన్ని మార్చేసింది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.    
yamuna

More Telugu News