భారతీయుడిపై దాడిని అడ్డుకున్న అమెరికన్‌కి టైమ్ మేగజైన్ గౌరవం
- జాతి వివక్ష దాడిలో గాయపడ్డ ఇయాన్ గ్రిలాట్
- కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాపాడే ప్రయత్నంలో బుల్లెట్ గాయం
- చనిపోయిన శ్రీనివాస్
ఓలెత్లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్లో కూచిభొట్ల శ్రీనివాస్, మాదసాని అలోక్‌పై ఆడమ్ ప్యూరింటన్ అనే అమెరికన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతిచెందగా అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే..ఆడమ్ ప్యూరింటన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఇయాన్ గ్రిలాట్కి బుల్లెట్ తగిలింది. ఆ తూటా ఇయాన్ ఛాతిలోకి దూసుకెళ్లింది. దాడి అనంతరం ఇయాన్‌ను ఆసుపత్రిలో చేర్చగా.. కొన్నాళ్ల తర్వాత కోలుకున్నాడు.
ఆ ఘటనతో ఇయాన్ కేన్సస్ హీరోగా అందరి మన్ననలు పొందాడు. ఇటీవలే హ్యూస్టన్‌లోని ఓ భారత- అమెరికన్ కమ్యూనిటీ అతడిని ‘నిజమైన అమెరికా హీరో’గా అభివర్ణించింది. ఇయాన్ కోసం లక్ష డాలర్ల నిధులు సేకరించి ఇచ్చింది.