మామయ్య నాగార్జునతో విభేదాలపై స్పందించిన సుమంత్!

  • నాగ్, సుమంత్ మాట్లాడుకోవడం లేదని వార్తలు
  • అంతా అవాస్తవమేనన్న సుమంత్
  • అసలు అలాంటి ప్రచారం జరుగుతున్నట్టు కూడా తెలియదు
  • అందరితో మంచి అనుబంధముందన్న సుమంత్
'ప్రేమకథ' చిత్రంతో పరిచయం చేయడంతో పాటు, కెరీర్ లో అతిపెద్ద హిట్ 'సత్యం'ను అందించిన మామయ్య నాగార్జునతో తనకు విభేదాలు వచ్చినట్టు వస్తున్న వార్తలపై హీరో సుమంత్ స్పందించాడు. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని వార్తలు హల్ చల్ చేస్తుండగా, మీడియాతో మాట్లాడిన సుమంత్, తాను గతంలో మామయ్యను రోజూ కలిసేవాడినని, అప్పటితో పోలిస్తే, ఇప్పుడు కొంత కలవడం తగ్గిందే తప్ప విభేదాలేమీ లేవని చెప్పుకొచ్చాడు.

 బయటి ప్రపంచంలో తనకు, నాగ్ మామకు మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం సాగుతున్న విషయం కూడా తెలియదని అన్నాడు. ఆయనతో నిత్యమూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటానని, అఖిల్, రానా, చైతూ... ఇలా అందరితో మంచి అనుబంధముందని, వారితో కలసి నటించే రోజు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

Sumant
Nagarjuna
Akhil
Rana

More Telugu News