మామయ్య నాగార్జునతో విభేదాలపై స్పందించిన సుమంత్!
- నాగ్, సుమంత్ మాట్లాడుకోవడం లేదని వార్తలు
- అంతా అవాస్తవమేనన్న సుమంత్
- అసలు అలాంటి ప్రచారం జరుగుతున్నట్టు కూడా తెలియదు
- అందరితో మంచి అనుబంధముందన్న సుమంత్
బయటి ప్రపంచంలో తనకు, నాగ్ మామకు మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం సాగుతున్న విషయం కూడా తెలియదని అన్నాడు. ఆయనతో నిత్యమూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటానని, అఖిల్, రానా, చైతూ... ఇలా అందరితో మంచి అనుబంధముందని, వారితో కలసి నటించే రోజు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు.