క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర పార్టీ గుర్తు... ఆటోరిక్షా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర పార్టీ గుర్తు... ఆటోరిక్షా!

  • ఆమోదం తెలిపిన ఎన్నిక‌ల క‌మిష‌న్‌
  • మీడియా స‌మావేశానికి ఆటోరిక్షాలో హాజ‌రైన న‌టుడు
  • క‌ర్ణాట‌క ప్ర‌జ్ఞావంత జ‌న‌తా ప‌క్ష పేరుతో పార్టీ
ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు తెలిపి `క‌ర్ణాట‌క ప్ర‌జ్ఞావంత జ‌న‌తా ప‌క్ష‌` పేరుతో క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర పెట్టిన పార్టీకి ఆటోరిక్షా గుర్తును ఎన్నిక‌ల క‌మిష‌న్ జారీ చేసింది. దీని గురించి మీడియాకు తెల‌ప‌డానికి ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఉపేంద్ర స్వయంగా ఆటోరిక్షా న‌డుపుకుంటూ వ‌చ్చి హాజ‌ర‌య్యారు.

పార్టీ ల‌క్ష్యాల‌ను ప్ర‌తిబింబించేలా ఆటోరిక్షా గుర్తు ఉందని ఉపేంద్ర అన్నారు. 'ఆటో అంటే ఇంగ్లిషులో స్వీయనియంత్రణ కలిగి ఉండేదని అర్థం. ప్ర‌జ‌లు ఎన్నుకోబోయే ప్ర‌భుత్వం కూడా అలాగే స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. ఎలాంటి స‌మ‌స్య‌లు సృష్టించ‌కుండా, ఉన్న స‌మ‌స్య‌ల‌ను పార‌ద్రోలి త‌నంత‌ట తానే మంచి పాల‌న సాగించాలి' అని ఉపేంద్ర వెల్లడించారు.
upendra
party
auto riksha

More Telugu News