ఆలియా భ‌ట్ కొత్త హెయిర్‌స్టైల్‌.... ఆట‌పట్టించిన నెటిజ‌న్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆలియా భ‌ట్ కొత్త హెయిర్‌స్టైల్‌.... ఆట‌పట్టించిన నెటిజ‌న్లు!

  • ఎల్లే మేగ‌జైన్ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆలియా
  • అబ్బాయిల హెయిర్‌క‌ట్‌తో పోల్చి కామెంట్లు
  • జిమ్ కేరీతో పోలిక‌
ఆలియా భ‌ట్‌... ఈ పేరు చెప్ప‌గానే అందంతో పాటు అభిన‌యం కూడా గుర్తొస్తుంది. వీటితో పాటు ఆలియా భ‌ట్ జోక్స్ కూడా గుర్తొస్తాయి. అయితే ఈ మ‌ధ్య ఈ జోక్స్ త‌గ్గిన మాట నిజ‌మే. తనపై ఎవరెన్ని జోకులు వేసినా ఆలియా భ‌ట్ వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోదు. త‌నకు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ పోతూనే ఉంది. అదే దారిలో ఇటీవ‌ల ఎల్లే మేగ‌జైన్ 21వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా క‌వ‌ర్ పేజీ ఫొటోషూట్‌లో పాల్గొంది. అయితే ఆ ఫొటోషూట్‌లో త‌న హెయిర్‌స్టైల్ ఇప్పుడు సోష‌ల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది.

అబ్బాయిల హెయిర్‌క‌ట్‌లా ఉంద‌ని, న‌టుడు జిమ్ కేరీ హెయిర్‌క‌ట్‌లా ఉందని నెటిజ‌న్లు ఆమెను ఆట‌ప‌ట్టిస్తున్నారు. చివ‌రికి ఆమె అభిమానులు కూడా ఈ హెయిర్‌స్టైల్ మీద అసంతృప్తి వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. మ‌రి ఆలియాభ‌ట్ ఇంత‌టి బోల్డ్ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెన‌క ఏదైనా అర్థం ఉండొచ్చ‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  
alia bhat
elle
new hairstyle
photoshoot
trolling

More Telugu News