Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ప్రమాదంలో చనిపోయేదాన్నే .. అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాను: యమున

  • షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా మా కారును లారీ గుద్దేసింది
  • చూస్తుండగానే కారు కాలిపోయింది
  • కారులో వున్నవాళ్లు బతికే అవకాశం లేదనుకున్నారు
  • ఇప్పటికీ కారులో నిద్రపోను  
తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తన కెరియర్ గురించిన విషయాలతో పాటు .. తనకి జరిగిన ఒక ప్రమాదాన్ని గురించి కూడా యమున చెప్పుకొచ్చారు. " ఓ తమిళ సీరియల్ షూటింగ్ చేస్తున్నాను .. 'కుట్రాళం'లో షూటింగ్. ముందు రోజు షూటింగ్ పూర్తి కావడంతో మరుసటి రోజు ఉదయం అక్కడి నుంచి కారులో బయలుదేరి బెంగుళూర్ వస్తుండగా లారీ గుద్దేసింది. దాంతో పెట్రోల్ ట్యాంక్ పగిలి కారు మొత్తం కాలిపోయింది"

"అంతకు ముందే ఏదో సౌండ్ వస్తుంటే 'సెంట్రల్ లాక్' ఓపెన్ చేశాను. అందువల్లనే బతికి బయటపడ్డాను. ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్లంతా కార్లోని వాళ్లు బతికి ఉండరని అనుకున్నారు. కంటి కింద చిన్న గాయం మినహా ఏమీ కాలేదు. హాస్పిటల్ కి తీసుకెళ్లాక అంత బాధలోను, నేను ఆర్టిస్టును .. నాకు కుట్లు వేయకండి .. మచ్చ పడకూడదు అంటూ అరిచాను. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కారులో నిద్రపోను" అంటూ చెప్పుకొచ్చారు.   
yamuna

More Telugu News