ఆ ప్రమాదంలో చనిపోయేదాన్నే .. అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాను: యమున
- షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా మా కారును లారీ గుద్దేసింది
- చూస్తుండగానే కారు కాలిపోయింది
- కారులో వున్నవాళ్లు బతికే అవకాశం లేదనుకున్నారు
- ఇప్పటికీ కారులో నిద్రపోను
"అంతకు ముందే ఏదో సౌండ్ వస్తుంటే 'సెంట్రల్ లాక్' ఓపెన్ చేశాను. అందువల్లనే బతికి బయటపడ్డాను. ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్లంతా కార్లోని వాళ్లు బతికి ఉండరని అనుకున్నారు. కంటి కింద చిన్న గాయం మినహా ఏమీ కాలేదు. హాస్పిటల్ కి తీసుకెళ్లాక అంత బాధలోను, నేను ఆర్టిస్టును .. నాకు కుట్లు వేయకండి .. మచ్చ పడకూడదు అంటూ అరిచాను. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కారులో నిద్రపోను" అంటూ చెప్పుకొచ్చారు.