తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు: 'భారత్ డ్రోన్' సంఘటనపై చైనా మీడియా
- ఇటీవలే భారత డ్రోన్‌ను కూల్చేసిన చైనా
- డోక్లాం సమీపంలోకి ప్రవేశించడంతోనే కూలిపోవాల్సి వచ్చింది
- భారత్ సారీ చెప్పాలి
- రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదు-గ్లోబల్ టైమ్స్
అంతేగాక, డ్రోన్‌తో తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడినందుకు భారత్ సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇటువంటి చొరబాట్లకు పాల్పడితే డ్రోన్‌ను కోల్పోవడమే కాదని, అంతకంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కుంటారని హెచ్చరించే ప్రయత్నం చేసింది. డోక్లాంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఆ భూభాగం విషయంలో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదని హితవు పలికింది.