మా అబ్బాయి పెళ్లికి మా అబ్బాయే వెళ్లి చిరంజీవిని పిలిచాడు: యండమూరి వీరేంద్రనాథ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా అబ్బాయి పెళ్లికి మా అబ్బాయే వెళ్లి చిరంజీవిని పిలిచాడు: యండమూరి వీరేంద్రనాథ్

  • ఎవరితో సినిమా చేస్తే వాళ్లతో వుంటాను 
  • ఆ తరువాత ఫోన్లు చేయను
  • నాగబాబు పెళ్లికి నేను వెళ్లకపోతే చిరంజీవి తిట్టాడు కూడా  
తెలుగు పాప్యులర్ టీవీతో యండమూరి మాట్లాడుతూ ఉండగా .. చిరంజీవితో గల సాన్నిహిత్యం గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడాయన స్పందిస్తూ .. " 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టకముందు వరకు నేను .. చిరంజీవి మాట్లాడుకున్నాం .. ఆ తరువాత ఒకసారి కలుసుకున్నాం .. అంతే.. ఆయనతో సినిమాలేం చేయడం లేదు కనుక ఆ తరువాత కలవలేదు.

"బాలకృష్ణతో సినిమాలు చేసేప్పుడు బాలకృష్ణతో కలిసే వున్నాను. బాలకృష్ణతోను  చాలా ఆత్మీయంగా మాట్లాడటం .. మనస్ఫూర్తిగా కౌగిలించుకోవడం ఉండేవి. ఆ తరువాత అసలు ఫోన్లో ఏవీ ఉండేవి కాదు. ఇది సినిమా రంగం లక్షణమో .. వ్యక్తుల లక్షణమో కాదు .. నా లక్షణం. నేనెవరికీ ఫోన్ చేయను .. నాకింతవరకూ చిరంజీవి ఇల్లెక్కడో కూడా తెలియదు. నాగబాబు పెళ్లికి కూడా నేను వెళ్లలేదు .. చిరంజీవి తిట్టాడు కూడా .. రాలేదేమిటని. మా అబ్బాయి పెళ్లికి కూడా మా అబ్బాయి వెళ్లి పిలిచాడు .. రమ్మని. నా మెంటాలిటీ అది కాదు .. అది పెద్ద గొప్ప అనుకోను కానీ .. విలక్షణం . . అంతే" అని చెప్పుకొచ్చారు.      
yandamoori
chiranjeevi

More Telugu News