పదవి లేకపోయినా ప్రజల సమస్యలను పరిష్కరించాలి!: పవన్ కల్యాణ్
'ముఖ్యమంత్రిని అయితేనే పరిస్థితులు బాగుంటాయని, ముఖ్యమంత్రిని అయితేనే సమస్యలను పరిష్కరిస్తానని నాయకుడు చెప్పుకునే సంస్కృతి పోవాలి' అని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... 'పదవి ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యలను పరిష్కరించే విధి విధానాలు ఉండాలని కోరుకుంటున్నాను. జనసేనకి మహిళా విభాగం లేదని కొందరు అంటున్నారు. అది కూడా పెడతాం. ఝాన్సీ లక్ష్మీభాయిలాంటి వారు జనసేనలోకి వస్తారు' అని పవన్ అన్నారు.