నా విషయంలో బాలచందర్ గారు చెప్పినట్టుగానే జరిగింది!: యమున
- నా అసలు పేరు 'ప్రేమ'
- 'యమున'గా బాలచందర్ గారు మార్చారు
- 100 డేస్ వేదికపై ఆయన ఆ మాట అన్నారు
"ఆ సినిమాలో సుహాసినికి చెల్లెలుగా నటించాను .. హిట్ అయింది. హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లో మెమెంటో ఇవ్వడానికి నన్ను స్టేజ్ మీదకి పిలిచి, 'భవిష్యత్తులో ఈ అమ్మాయి నాకు డేట్స్ ఇవ్వనంత బిజీ అవుతుంది' అన్నారు బాలచందర్ గారు. ఆ తరువాత నిజంగా అదే జరిగింది. ఆయన దర్శకత్వం వహించే రెండు .. మూడు సినిమాలకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాను. ఆయన బ్యానర్లో సినిమాలే కాదు .. సీరియల్స్ కి అడిగినా చేయలేకపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.