Pawan Kalyan: కులానికి అంత ప్రాధాన్యత ఉంటే పాలకొల్లులో చిరంజీవిని ఎందుకు ఓడించారు?: పవన్ కల్యాణ్
- కులం అనేది సామాజిక సత్యం
- కులం అనేది మిథ్య
- నేను భారతీయుడిని, నాకు కులం, మతం లేవు
- అన్నింటికీమించి మానవత్వం ఉన్నోడిని
కులం అనే విషయానికి రాజకీయాల్లో అంత ప్రాధాన్యత ఎందుకివ్వాలని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు రాజమహేంద్ర వరంలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... కులానికి అంత ప్రాధాన్యత ఉంటే పాలకొల్లులో చిరంజీవిని ఎందుకు ఓడించారని ప్రశ్నించారు.
'కులం అనేది సామాజిక సత్యం... కులం అనేది మిథ్య. నేను భారతీయుడిని, నాకు కులం, మతం లేవు. అన్నింటికీమించి మానవత్వం ఉన్నోడిని' అని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన విధి విధానాలపై జనవరిలో వర్క్‌షాప్ పెడతానని చెప్పారు. రాజకీయనాయకులు మేనిఫెస్టోలో పెట్టే ప్రతి అంశం మహా వాక్యం అని, వాటన్నింటినీ అమలు చేయాల్సిందేనని ఆయన అన్నారు. అలాగే బలప్రదర్శన వల్ల పనులు జరగవని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.