ఎస్వీ కృష్ణారెడ్డితో బాలకృష్ణ మూవీ .. వచ్చేనెలలో సెట్స్ పైకి?
- బాలకృష్ణకి కథ వినిపించిన ఎస్వీ కృష్ణారెడ్డి
- ఫాంటసీ నేపథ్యంలో కొనసాగనున్న కథ
- గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన 'టాప్ హీరో'
ఈ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. గతంలో బాలకృష్ణతో 'టాప్ హీరో' చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి. ఎన్నో కుటుంబ కథా చిత్రాలను అందించిన కృష్ణారెడ్డి .. ఇటీవల బాలకృష్ణకి ఒక ఫాంటసీ కథ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథ బాలకృష్ణకి నచ్చినట్టుగా కూడా చెప్పేసుకున్నారు .. అది నిజమేనని తెలుస్తోంది. జనవరిలో ఈ ప్రాజెక్టును లాంచ్ చేయనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు.