'మిలియన్ డాలర్ బేబీ' రీమేక్‌లో అక్షయ్ కుమార్?
- బాలీవుడ్‌కి మరో బాక్సింగ్ మూవీ
- దర్శకత్వం వహించనున్న ఏఆర్ మురుగదాస్
- బాక్సింగ్ కోచ్ పాత్రలో అక్షయ్
ఇక ప్రధాన పాత్రలో టీవీ నటి మెరీనా కువార్ను చిత్రబృందం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'పద్మన్', 'కేసరి', 'గోల్డ్' చిత్రాలతో బిజీగా ఉన్న అక్షయ్, ఈ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 2004లో విడుదలైన 'మిలియన్ డాలర్ బేబీ' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో బాక్సింగ్ క్రీడాకారిణిగా హిల్లరీ స్వాంక్, ఆమె కోచ్‌గా ప్రఖ్యాత నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ నటించారు.