నాకు మూడు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి...!: నమిత

  • లవ్ ఫెయిల్యూర్స్ వల్ల చాలా తెలుసుకున్నాను 
  • వీర్ ప్రపోజల్ ను తిరస్కరించేందుకు ఒక్క కారణం కూడా కనబడలేదు
  • భర్త, అత్తమామలు రూల్స్ పెట్టలేదు
తనకు గతంలో మూడు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయని ఈ మధ్యే వివాహం చేసుకున్న సినీ నటి నమిత తెలిపింది. గత, ప్రస్తుత జీవితం గురించి ఒక ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడుతూ, గతంలో ఆ మూడు లవ్ ఫెయిల్యూర్స్ జీవితంలో సరైన వ్యక్తిని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో తెలిసేలా చేశాయని చెప్పింది. తనను వీర్ కలిసి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఆయనను తిరస్కరించేందుకు ఒక్క కారణం కూడా కనిపించలేదని తెలిపింది.

ఒకవేళ ఆయన ప్రపోజ్ చేయకపోయి ఉంటే, తానే ప్రపోజ్ చేసి ఉండేదానినని నమిత తన మనసులోని మాటను వెల్లడించింది. పెళ్లి తరువాత తన జీవితంలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదని, అయితే మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు మాత్రం కొత్తగా వచ్చాయని చెప్పింది. అంతే తప్ప సంప్రదాయం పేరుతో కుంకుమ బొట్టు పెట్టుకో, చీరకట్టుకో అంటూ భర్త కానీ, అత్తమామలు కానీ తనపై ఎటువంటి నిబంధనలూ పెట్టలేదని తెలిపింది. 
Go Back to Shorts
namita
actress
love failures

More Telugu News