రేపటి నుంచి 'సైరా' రెగ్యులర్ షూటింగ్ మొదలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపటి నుంచి 'సైరా' రెగ్యులర్ షూటింగ్ మొదలు!

  • 'సైరా' మొదటి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో
  • అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ 
  • చిరూ కెరియర్లోనే భారీ బడ్జెట్ 
  • కథానాయికగా నయనతార
సైరా' సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ 6వ తేదీ నుంచి మొదలుపెడుతున్నట్టుగా టీమ్ ప్రకటించింది. అలా ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు మొదలుకానుంది.

 హైదరాబాద్, గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. చిరంజీవి గెటప్ ఎలా వుంది?.. ఆయన లుక్ ఎలావుంది? అనే విషయంలోఇటీవలే టెస్టు షూట్ చేశారు. చిరూ లుక్ పట్ల అంతా సంతృప్తిని వ్యక్తం చేయడంతో సెట్స్ పైకి వచ్చేస్తున్నారు.

ఇక కెమెరామెన్ రవివర్మన్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి రత్నవేలును తీసుకున్నారు. ఇక రెహ్మాన్ ప్లేస్ లో మరో మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేసే పనిలో వున్నారు. చిరూ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పేర్కొంటోన్న 'సైరా'లో, నయనతార కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే.   
chiranjeevi
nayanatara

More Telugu News