నెమ్మది నెట్‌వర్క్‌ల కోసం 'గూగుల్ గో'... తక్కువ డేటా వినియోగించుకునే యాప్!
- ఇవాళే విడుదల చేసిన గూగుల్
- వేగంగా సెర్చ్ ఫలితాలు
- దేశీయ భాషల్లోనూ లభ్యం
ఇంగ్లీష్‌తో పాటు ఇతర దేశీయ భాషల్లోనూ ఈ యాప్ లభ్యమవుతోంది. ఎక్కువ పదాలను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ట్రెండింగ్ సెర్చ్ పదాలను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచారు. కేవలం 5 ఎంబీ ఉన్న ఈ యాప్‌లో గూగుల్ వారి వాయిస్ సెర్చ్, ఇమేజ్ సెర్చ్, జిఫ్ సెర్చ్, యూట్యూబ్, వాతావరణం వంటి అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇటీవలే డేటా మానిటరింగ్ కోసం డేటాల్లీ అనే యాప్‌ను గూగుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.