ఇవాంక కోసం అరెస్ట్... వెళ్లగానే విడుదల... మళ్లీ రోడ్లపై బిచ్చగాళ్లు!
- జీఈఎస్ కు ముందు యాచకుల అరెస్ట్
- సదస్సు ముగియగానే వదిలేసిన జైలు అధికారులు
- తిరిగి రోడ్లపై అడుక్కుంటున్న యాచకులు
చర్లపల్లి జైలు నుంచి, చంచల్ గూడ జైలు నుంచి యాచకులను వదిలేశామని జైలు అధికారులు వెల్లడించారు. వారు మళ్లీ యాచక వృత్తిలోకి అడుగు పెట్టకుండా, పెట్రోలు బంక్ లు, స్టోర్లలో ఉద్యోగాలు చేసే అవకాశాలు అందిస్తామని చర్లపల్లి ఒపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్ అర్జునరావు వెల్లడించినా, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. హైదరాబాద్ రోడ్లపై తిరిగి బిచ్చగాళ్లు కనిపిస్తుండటంతో వారిని పట్టుకునేందుకు ఈ నెల 25వ తేదీ నుంచి మరో విడత స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని పోలీసులు చెబుతుండటం గమనార్హం.