ఏపీకి సినీ పరిశ్రమ అవసరం లేదు.. హైదరాబాదులో మేం హ్యాపీ!: తమ్మారెడ్డి భరద్వాజ
- ప్రభుత్వానికి మా అవసరం లేదు
- అవసరం వస్తే మాట్లాడుదాం
- హైదరాబాదులో బాగానే ఉన్నాం
విశాఖపట్టణాన్ని ఫిలిం హబ్ గా అభివృద్ధి చేయాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమను విశాఖకు తీసుకురావాలన్న ఆలోచన, కోరిక ప్రభుత్వానికి లేవని ఆయన అన్నారు. ఆ కోరిక లేనప్పుడు తామెందుకు రావాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం తామంతా హైదరాబాదులో బాగానే ఉన్నామని ఆయన తెలిపారు. ఏపీలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏదో చేస్తుందని భావించామని, అయితే ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆయన విమర్శించారు.