లాక్ స్క్రీన్ ప్రకటనలిచ్చే యాప్‌లను నిషేధించిన గూగుల్ ప్లే స్టోర్
- డెవలపర్ పాలసీలో మార్పులు చేసిన గూగుల్
- అవసరం ఉంటే మినహా అలాంటి ప్రకటనలు వేయొద్దని ఉవాచ
- నిషేధించిన వాటిలో చైనా యాప్‌లే ఎక్కువ
ఈ మేరకు డెవలపర్ పాలసీలో గూగుల్ మార్పులు చేసింది. అత్యవసరం ఉంటే మినహా లాక్‌స్క్రీన్ ప్రకటనలు వేయొద్దని అందులో పేర్కొంది. డబ్బుల కోసం లాక్ స్క్రీన్ ప్రకటనలు వేస్తున్న ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, హాట్‌స్పాట్ షీల్డ్ వీపీఎన్ వంటి ప్రముఖ యాప్‌లను గూగుల్ నిషేధించింది. ఈ కోవలోనే చైనాకు చెందిన చాలా యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.