జగన్ చిన్నప్పటి నుంచి తెలిసున్న కుర్రాడు, ప్రేమ ఉంది... అధికారంలోకి తెచ్చేంత సమర్థత నాకు లేదు: ఉండవల్లి
- జగన్ చేసిన పనులన్నిటినీ సమర్థించలేను
- చిన్నప్పటి నుంచీ తెలిసున్న కుర్రాడు జగన్
- పాదయాత్ర సీఎం పీఠం వరకూ చేరుస్తుందో లేదో చెప్పలేను
- చంద్రబాబు అమరావతిని నేను చూడలేను
అదే ఉంటే, తానే అధికారంలో ఉండుండే వాడినని చెప్పారు. తనకా శక్తి, ఆసక్తి లేవని అన్నారు. పోలవరం ప్రాజెక్టును రాజశేఖరరెడ్డి ప్రారంభించారు కాబట్టి, తన ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి, దాని గురించిన పుట్టు పూర్వోత్తరాలు తెలుసునని చెప్పారు. ఇక అమరావతి గురించి ప్రస్తావిస్తూ, చంద్రబాబు చూపిస్తున్న అమరావతిని తాను చూడలేనని, చంద్రబాబు జన్యు పరంగా అద్భుత నిర్మాణం కలిగుండి, 130 ఏళ్లు బతుకుతాడేమోగానీ, తాను బతకనని అన్నారు. రేపు ఏమవుతుందో తనకు తెలియదని, తాను ఎవరికీ కోచ్ ని కాదని, ఎన్నికల్లో ఎలా గెలవాలన్నది తనకు తెలియదని అన్నారు. జగన్ పాదయాత్రను గురించి ఆలోచించడం లేదని, అది ఆయన్ను సీఎం పీఠం వరకూ తీసుకెళుతుందా అన్నది చెప్పే మూడ్ లేదని ఉండవల్లి అన్నారు.