'అల్లా' అన్న ఆరేళ్ల విద్యార్థి... పోలీసులను పిలిపించిన టీచర్!
- తరగతి గదిలో 'అల్లా... బూమ్' అంటూ అరిచిన విద్యార్థి
- ఆందోళనతో ఫిర్యాదు చేసిన టీచర్
- తన కుమారుడు మాట్లాడలేడంటున్న తండ్రి
- జాతి వివక్షతోనే ఫిర్యాదంటూ ఆరోపణలు
ఆ విద్యార్థి పేరు మహ్మద్ సులేమాన్ కాగా, అతను బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడని అతని తండ్రి పోలీసులకు చెప్పాడు. అతను చదివే పాఠశాలకు నిత్యమూ వచ్చే టీచర్ కు తన కుమారుడి విషయం తెలుసునని, ఆమె కాకుండా మరో టీచర్ రావడంతోనే పోలీసులకు ఫిర్యాదు వెళ్లిందని చెప్పాడు. తన కుమారుడికి సరిగ్గా మాటలు కూడా రావని, ఈ ఫిర్యాదు వెనుక జాతి వివక్ష ఉందని ఆరోపించాడు. చిన్న బిడ్డపై ఉగ్రవాదిగా ముద్ర వేయడం ఏంటని ప్రశ్నించాడు. కాగా, ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, ఇప్పటివరకూ ఎటువంటి చర్య తీసుకోలేదని పియర్లాండ్ పోలీసులు వెల్లడించారు.