కొట్టి, హేళన చేస్తే హాస్యమా?: జబర్దస్త్ షోపై ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం!
- ఇతర వర్గాలను కించపరిస్తే హాస్యమా?
- న్యాయ నిర్ణేతలకు నవ్వు ఎలా వస్తోంది?
- హైపర్ ఆది క్షమాపణ చెప్పాల్సిందే
- దివ్యాంగుల హక్కుల సమితి డిమాండ్
ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' షోలో అనాథ పిల్లలను, కించపరిచారని, మహిళలను అగౌరవ పరుస్తున్నారని విమర్శించారు. ఇతరులను అవమానిస్తూ, అదే హాస్యం అని చూపించడం తగదని, ఇతర యాంకర్లు, న్యాయ నిర్ణేతలకు ఈ షోను చూస్తే ఎందుకు నవ్వు వస్తున్నదో తెలియడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు, రియాల్టీ షోల పేరిట ఏ వర్గాన్నీ కించపరిస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.