Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంజయ్‌ద‌త్ బ‌యోపిక్‌లో అతిథి పాత్రలో ఆమిర్ ఖాన్‌?

  • షూటింగ్‌ సెట్‌లో క‌నిపించిన ఆమిర్‌
  • గ‌తంలో సునీల్ ద‌త్ పాత్ర కోసం ఆమిర్‌ను అనుకున్న చిత్ర యూనిట్‌
  • అప్పట్లో తిర‌స్క‌రించిన ఆమిర్‌
సంజ‌య్‌ద‌త్ జీవితం ఆధారంగా ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరానీ సినిమా తీయ‌నున్నార‌ని ప్రకటించినప్పుడు సంజ‌య్ తండ్రి సునీల్ ద‌త్ పాత్రలో ఆమిర్ ఖాన్ న‌టించ‌నున్నాడ‌ని వార్తలు వ‌చ్చాయి. ఈ పాత్ర కోసం రాజ్ కుమార్, ఆమిర్‌ని అడిగినపుడు ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించార‌ని త‌ర్వాత స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఈ నేపథ్యంలో సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్ 'సంజు' షూటింగ్ సెట్లో ఇటీవల ఆమిర్ ఖాన్ క‌నిపించిన‌ట్లు ఓ బాలీవుడ్ సినిమా వెబ్‌సైట్ వెల్ల‌డించింది.

దీన్ని బ‌ట్టి చూస్తే ఓ ప్ర‌త్యేక పాత్రలో ఆమిర్ క‌నిపించే అవకాశాలు ఉన్న‌ట్లు తెలిపింది. ర‌ణ్‌బీర్ క‌పూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ పాత్ర‌లో చాలా మంది బాలీవుడ్ అగ్ర‌తారాగ‌ణం ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ట‌. వారిలో ఆమిర్ కూడా ఉండ‌వ‌చ్చ‌ని జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోంది. మ‌రి ఎవ‌రెవ‌రు ఎలా క‌నిపిస్తారో తెలియాలంటే వ‌చ్చే ఏడాది మార్చి 30 వ‌ర‌కు ఆగాల్సిందే!
sanju
sanjay dutt
aamir khan

More Telugu News