మళ్లీ వచ్చేస్తానంటోన్న జెనీలియా!

  • అల్లరిపిల్లగా మార్కులు కొట్టేసిన జెనీలియా 
  • వివాహం తరువాత నటనకి దూరం 
  • మళ్లీ నటనపై దృష్టి 
  • ఎలాంటి పాత్రలను ఎంచుకుంటుందనే విషయంలో ఆసక్తి   
తెలుగు .. తమిళ .. హిందీ .. మరాఠి ప్రేక్షకుల్లో జెనీలియాకు మంచి గుర్తింపు వుంది. వివాహం తరువాత ఆమె నటనను దూరమైంది. మళ్లీ ఇప్పుడు నటన దిశగా అడుగులు వేయనున్నట్టు తానే స్వయంగా ప్రకటించింది. తెలుగులో 'సై' .. 'హ్యాపీ' .. 'బొమ్మరిల్లు' .. 'ఢీ' .. 'రెడీ' సినిమాలతో జెనీలియా ఘన విజయాలను అందుకుంది. అల్లరిపిల్లగా అందరి మనసులను గెలుచుకుంది. జెనీలియా లాంటి హీరోయిన్ ఇంతవరకు రాలేదనే వాళ్లు లేకపోలేదు.

అంతగా ఆమె తన నటనతో ప్రభావం చూపించింది. అలాంటి జెనీలియా ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మరాఠీతో పాటు దక్షిణాది భాషల్లో నటించడానికి తాను సిద్ధమవుతున్నట్టుగా చెప్పింది. ఈ వార్త ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగించేదే. అయితే శ్రీదేవి మాదిరిగా కథ తనచుట్టూ తిరిగే పాత్రలను మాత్రమే చేస్తుందా? కేరక్టర్ రోల్స్ కూడా చేస్తుందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.    
Go Back to Shorts
genelia

More Telugu News