raj babbar: అమిత్ షా అసలు హిందువే కాదు: రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు

  • అమిత్ షా జైన మతస్తుడు
  • ముంబైలో పుట్టి, గుజరాత్ లో సెటిలయ్యారు
  • గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మతాల గొడవ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని అమిత్ షా చెప్పుకుంటుంటారని... ఆయన అసలు హిందువే కాదని అన్నారు. ఆయన జైన మతస్తుడు అని చెప్పారు. ముంబైలోని జైన కుటుంబంలో అమిత్ షా పుట్టారని...  ఆ తర్వాత గుజరాత్ కు వచ్చి సెటిలయ్యారని తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మతాల గొడవ ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నాన్ హిందూ డిక్లరేషన్ బుక్ లో సంతకం చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే, అమిత్ షాపై రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
raj babbar
amit shah
gujarath elections

More Telugu News