మ‌ళ్లీ పుంజుకున్న జీడీపీ.. తొలగిపోతోన్న‌ పెద్ద‌ నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌ళ్లీ పుంజుకున్న జీడీపీ.. తొలగిపోతోన్న‌ పెద్ద‌ నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు!

  • 2017-18 తొలి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన జీడీపీ
  • జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో మాత్రం 6.3 శాతంగా నమోదు
  • ముఖ్యంగా నిర్మాణ రంగం వృద్ధి
జీడీపీ వృద్ధి రేటు ఈ త్రైమాసికంలో మళ్లీ పెరిగింది. 2017-18 తొలి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయి 5.7 శాతంగా నమోదైన‌ జీడీపీ, జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 6.3 శాతం నమోదు చేసింది. అయితే, గ‌త ఏడాది ఇదే త్రైమాసికంలో మాత్రం 7.5 శాతంగా న‌మోదైంది. తయారీ రంగం, విద్యుత్‌, గ్యాస్‌, మంచినీటి సరఫరా, ట్రేడ్‌, హోటల్స్‌, రవాణా, సేవల రంగాల్లో ఈ త్రైమాసికంలో వృద్ధిరేటు పెరిగిందని విశ్లేష‌కులు పేర్కొన్నారు.

ఈ త్రైమాసికంలో ముఖ్యంగా నిర్మాణ రంగం వృద్ధి చెంద‌డం వ‌ల్ల‌ జీడీపీ వృద్ధిరేటు ఇంత‌గా న‌మోదైంద‌ని కేంద్ర ఆర్థికశాఖ‌ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌ నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు తొలగిపోతున్నాయని ఆయ‌న వివ‌రించారు.
gst
demonitization
gdp
Arun Jaitly

More Telugu News