ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హిందువు కాదు: క‌పిల్ సిబ‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హిందువు కాదు: క‌పిల్ సిబ‌ల్

  • సోమ్‌నాథ్‌ దేవాలయంలో నాన్-హిందుగా పేర్కొన్న రాహుల్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు
  • మోదీపై క‌పిల్ సిబల్ విమ‌ర్శ‌లు
  • హిందూయిజానికీ-హిందుత్వకూ తేడా ఉంది
  • మోదీ అనుసరించేది హిందుత్వం
గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిన్న సోమ్‌నాథ్‌ దేవాల‌యానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, ఎంట్రీ బుక్‌లో ఆయ‌న నాన్‌-హిందువుగా పేర్కొన‌డం వివాదానికి తావిచ్చింది. త‌మ నేతపై బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తోన్న నేప‌థ్యంలో స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీనే హిందువు కాద‌ని వ్యాఖ్యానించారు. మోదీ అనుసరించేది హిందుత్వమని, హిందూయిజానికీ-హిందుత్వకూ తేడా ఉందని తెలిపారు. న‌రేంద్ర‌ మోదీ తరచూ దేవాలయాలకు వెళుతుంటారా? అని ఆయ‌న అడిగారు. నిజ‌మైన హిందువు అంటే ప్రతి భారతీయుడిలోనూ సోదరుడు, సోదరి, తల్లిని చూసేవాడని హిత‌వు ప‌లికారు. 
rahul gandhi
somnath temple
Narendra Modi

More Telugu News