ఆర్కేనగర్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఖరారు.. మధుసూదన్ కే టికెట్!
- అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదన్ ఖరారు
- టికెట్ కోసం పోటీ పడ్డ 19 మంది
- పన్నీర్ సెల్వంకు మధుసూదన్ నమ్మకస్తుడు
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్ కు ఉప ఎన్నిక జరుగుతోంది. అసలు గత ఏప్రిల్ లో జరగాల్సిన ఈ ఎన్నికను పోలింగుకు ముందు, ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెడుతున్నారంటూ పలు ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇప్పుడు డిసెంబర్ 21న ఎన్నికలు జరగనున్నాయి. 24వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.