మినీ మోదీతో ప్రధాని మోదీ... వీడియో చూడండి!
- గుజరాత్ లో జోరుగా మోదీ ప్రచారం
- అచ్చం తనలానే కనిపించిన ఓ బుడతడు
- వేదికపైకి పిలిపించుకుని మోదీ ముచ్చట్లు
- నెట్టింట వైరల్ అయిన వీడియో
నవసరి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఈ ఘటన జరుగగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ బాలుడు ఇప్పుడు 'మినీ మోదీ'గా మారిపోయాడు. చివరికి మణికట్టుకు కూడా తనలాగే నల్లదారాలు కట్టుకుని కనిపించిన ఆ బాలుడి ఫోటోను మోదీ, స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పరిచయం చేయడం గమనార్హం. ఈ మినీ మోదీని ప్రధాని మోదీ కలిసిన వీడియోను మీరూ చూడవచ్చు.