Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంపైర్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన ర‌వీంద్ర జ‌డేజా... ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్న నెటిజ‌న్లు

  • హిందీ పాట‌ల‌కు స్టెప్పులు వేసిన అంపైర్‌
  • గ్రౌండ్‌లో అద‌ర‌గొట్టే డ్యాన్స్‌
  • వైర‌ల్ అవుతున్న వీడియో
అంపైర్‌... క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతున్నపుడు క్లిష్ట‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటాడు. కొన్నిసార్లు ఇతని నిర్ణ‌యం మీదే మ్యాచ్ ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే వాళ్లు ఎప్పుడు చూసినా... సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తారు. కానీ ఫ‌న్నీగా ఉండే అంపైర్లు కూడా ఉన్నారు. అందుకు భార‌త ఆట‌గాడు ర‌వీంద్ర జ‌డేజా త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసిన వీడియో సాక్ష్యం.

గ్రౌండ్‌లో హిందీ పాట‌ల‌కు అద‌ర‌గొట్టే స్టెప్పులు వేస్తున్న ఈ వీడియోను జ‌డేజా రెండు రోజుల క్రితం షేర్ చేశాడు. న‌వీ ముంబైలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఇత‌న్ని అంద‌రూ గోత్యా అంపైర్ అని పిలుస్తార‌ట‌. ఏదేమైనా వీడియో మాత్రం చాలా ఫ‌న్నీగా ఉంది. నెటిజన్లు న‌వ్వాపుకోలేక షేర్ల మీద షేర్లు చేసి దీన్ని వైర‌ల్‌గా మారుస్తున్నారు.

umpire
Ravindra Jadeja
video
viral

More Telugu News