బట్టలు తీసి నిలబడండి... కాగితం ముక్క కోసం 88 మంది అమ్మాయిలకు కస్తూర్బా గాంధీ స్కూలు శిక్ష!
- టీచర్ పై అసభ్య రాతలు రాసిన స్టూడెంట్
- ఆ కాగితం కోసం బట్టలూడదీయించిన టీచర్లు
- అరుణాచల్ ప్రదేశ్ లో దారుణం
- పోలీసులకు ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి
ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఓ జూనియర్ టీచర్ కలిసి ఈ పని చేయించారు. క్లాస్ టీచర్ పై ఓ స్టూడెంట్ అసభ్యరాతలు రాయగా, ఆ కాగితం ముక్క కోసం మిగతా విద్యార్థుల ముందు బట్టలు ఊడదీయించారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని హెచ్చరించారు. ఈ ఘటన నిజమేనని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన దారుణమని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పాలన జరుగుతున్న తీరుకు ఇటువంటి ఘటనలు నిదర్శనమని పేర్కొంది.