ట్రంప్ కంటే హిల్లరీనే డేంజరస్.. ఆమె గెలిచి ఉంటే ఈ పాటికి యుద్ధం వచ్చుండేది!: హాలీవుడ్ నటి
- హిల్లరీ ప్రమాదకరమైన వ్యక్తి
- వలసదారులను వెనక్కి పంపడంలో తప్పు లేదు
- ఒబామా హయాంలో కూడా ఇది జరిగింది
హిల్లరీ ప్రమాదకరమైన వ్యక్తి అనేది తన అభిప్రాయమని చెప్పారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపించడంపై ట్రంప్ కు ఆమె మద్దతు పలికారు. ఒబామా హయాంలో కూడా ఇదే పనిని మరో విధంగా నిర్వహించారని... ఇప్పటి కంటే అప్పుడు ఎక్కువ మందిని పంపించేశారని తెలిపారు. ఒబామాకు శాంతి బహుమతి రావడం తనను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తోందని చెప్పారు.