వినియోగదారులకు శుభవార్త చెప్పిన జియో.. మళ్లీ ప్రారంభమైన బుకింగ్స్!
- రెండో విడత బుకింగ్ ప్రారంభించిన జియో
- వినియోగదారులకు సందేశాలు
- మొత్తం పది లక్షల మంది టార్గెట్
జియో 4జీ ఫీచర్ ఫోన్ ప్రారంభానికి ముందే టెలికం రంగంలో సంచలనం సృష్టించింది. దీనిని ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించిన జియో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసింది. ఆగస్టు 24న ముందస్తు బుకింగ్ ప్రారంభం కాగా 60 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఇటీవల ఫోన్ డెలివరీలు ప్రారంభించిన జియో పంపిణీ పూర్తి చేసింది. దీంతో ఇప్పుడు రెండో విడతకు సిద్ధమైంది.
గతంలో ఆసక్తి కనబరిచిన మొత్తం 10 లక్షల మందికి ఇప్పుడు మెసేజ్లు పంపిస్తోంది. రూ.500 చెల్లించి బుక్ చేసుకున్న అనంతరం ఫోన్ ఎప్పుడు అందించేది చెబుతారు. కాగా, జియో 4జీ ఫీచర్ ఫోన్ కోసం చెల్లించే రూ.1500ను మూడేళ్ల తర్వాత తిరిగి చెల్లించనున్నట్టు జియో ఇది వరకే పేర్కొంది.