పవన్ నుంచి నేర్చుకున్నది నిజాయతీ .. మంచితనం: శివబాలాజీ
- పవన్ తో కలిసి పని చేసిన రోజులను మరిచిపోలేను
- ఆయన మాటలన్నీ మనసులో నుంచే వస్తాయి
- ఆయనతో పరిచయమున్న వాళ్లంతా ఇదే మాట చెబుతారు
అప్పుడాయన స్పందిస్తూ .. " కల్యాణ్ గారితో కలిసి పని చేసిన రోజులను ఎప్పటికీ మరిచిపోలేను. జీవితంలో ఎప్పుడైనా వెనక్కి వెళ్లాలనిపిస్తే, ఆ రోజులకి వెళ్లాలనుకుంటాను. ఆయన మాట్లాడే ప్రతిమాట ఆయన మనసు నుంచే వస్తుంది. పవన్ మాటలు ఆయన హృదయానికి దగ్గరగా ఉంటూ .. ఎదుటివారి హృదయాలను తాకుతాయి. ఆయన నుంచి ముందుగా నేర్చుకోవలసింది నిజాయతీ. ఆ తరువాత ఆయనలో మనకి కనిపించేది మంచితనం. ఆయన నుంచి నేను నేర్చుకున్నవి ఇవే. నేనే కాదు .. ఆయనతో పరిచయమున్న వాళ్లంతా ఈ మాట తప్పకుండా చెబుతారు" అంటూ స్పష్టం చేశాడు.