అజిత్ ద్విపాత్రాభినయం .. ఒక కథానాయికగా కీర్తి సురేశ్!

  • అజిత్ తాజా చిత్రంగా 'విశ్వాసం'
  • జనవరిలో సెట్స్ పైకి
  • దీపావళికి విడుదల చేయాలనే ఆలోచన
తమిళంలో ఇప్పుడు అజిత్ .. విజయ్ మధ్య బలమైన పోటీ నడుస్తోంది. ఒకరి తరువాత ఒకరు భారీ విజయాలను నమోదు చేస్తూ, తమ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ కూడా తమ తాజా చిత్రాలపై దృష్టి పెట్టారు. అజిత్ తన తదుపరి సినిమాను శివ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ దర్శకుడితో గతంలో ఆయన చేసిన 'వీరమ్' .. 'వేదాళం' .. 'వివేగం' భారీ విజయాలను సాధించాయి.

 ఈ నేపథ్యంలో 'విశ్వాసం' అనే టైటిల్ తో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. ఆయన సరసన ఒక కథానాయికగా అనుష్కను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. రెండవ కథానాయికగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అజిత్ తో చేయాలనే ఆమె కల ఈ సినిమాతో తీరబోతోంది. జనవరిలో ఈ సినిమా షూటింగును మొదలెట్టి, దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.      
Go Back to Shorts
ajith
keerthi suresh

More Telugu News