మనోళ్లు తిప్పేశారు... 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో లంక!

  • అశ్విన్ కు మూడు వికెట్లు
  • ముగ్గురు లంక ఆటగాళ్లు డక్కౌట్
  • ఇన్నింగ్స్ విజయానికి దగ్గరైన భారత్
నాగపూర్ లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయానికి దగ్గరైంది. తొలి ఇన్నింగ్స్ లో 610 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, మూడో రోజు ఆటను ఒక వికెట్ నష్టానికి 21 పరుగుల వద్ద ముగించి, నాలుగో రోజు ఆటను ప్రారంభించిన లంకేయులను భారత బౌలర్లు అల్లాడించారు.

లంచ్ విరామ సమయానికే 7 వికెట్లు పడగొట్టారు. ఆశ్విన్ కు మూడు వికెట్లు లభించగా, ఇశాంత్ శర్మ, జడేజాలకు తలో రెండు వికెట్లు లభించాయి. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ ను పడగొట్టాడు. లంక ఆటగాళ్లలో సమరవిక్రమ, పెరీరా, హెరాత్ డక్కౌట్ కాగా, కరుణరత్నే 18, తిరిమన్నే 23, మ్యాథ్యూస్ 10, డిక్ వెల్లా 4, శనాక 17 పరుగులకు అవుట్ అయ్యారు.

ప్రస్తుతం చండీమల్ ఒక్కడే 34 పరుగులతో క్రీజులో పోరాడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటాలంటే, లంక ఇంకా 295 పరుగులు చేయాల్సి వుంది. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో, భారత విజయాన్ని లంక ఆటగాళ్లు అడ్డుకునే పరిస్థితి అసాధ్యమే. ప్రస్తుతం లంక స్కోరు 36 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు.
Go Back to Shorts
india
Sri Lanka
Cricket

More Telugu News