Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌న‌పై వ‌స్తోన్న వార్త‌ల‌పై మండిప‌డ్డ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి!

  • 100% ల‌వ్‌కి రీమేక్‌గా త‌మిళంలో రూపుదిద్దుకుంటోన్న‌ 100% కాదల్  
  • ఆ సినిమా నుంచి తప్పుకున్న లావ‌ణ్య‌
  • నడిగర్‌ సంఘం ఆమెపై రూ.3 కోట్ల దావా వేసినట్లు ప్ర‌చారం
  • మౌనంగా ఉన్నాన‌ని ఇష్టమొచ్చినట్లు రాసేస్తే ఎలా?- లావ‌ణ్య‌
త‌న గురించి గాసిప్స్ రాస్తోన్న వారిపై హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠికి కోపం వ‌చ్చింది. తెలుగు సినిమా '100%ల‌వ్‌'కి రీమేక్‌గా త‌మిళంలో రూపుదిద్దుకుంటోన్న‌ '100% కాదల్‌' అనే సినిమా నుంచి లావణ్య త్రిపాఠి తప్పుకుని, డేట్లు కుద‌ర‌ట్లేవ‌ని చెప్పుకుంది. అయితే, ఆమె ఆ సినిమా నుంచి తప్పుకోవడంపై నడిగర్‌ సంఘం ఆమెపై రూ.3 కోట్ల దావా వేసినట్లు ప్ర‌చారం జరుగుతోంది. ఓ ఇంట‌ర్వ్యూలో దీనిపై స్పందించిన లావ‌ణ్య త్రిపాఠి అన్ని విషయంల్లోనూ తాను నిదానంగా వ్యవహరిస్తానని తెలిపింది.

తాను మౌనంగా ఉన్నాన‌ని ఇష్టమొచ్చినట్లు రాసేస్తే ఎలా? అని లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌శ్నించింది. ఇటువంటి పుకార్లు త‌న‌పై ఎటువంటి ప్రభావం చూపవని పేర్కొంది. త‌న‌కు తృప్తినిచ్చే కథలనే ఎంచుకుంటానని. త‌న‌ను ఉత్సాహ పరిచే సినిమాల్లోనూ నటిస్తానని తెలిపింది.
lavanya tripathi
anger
cinema

More Telugu News