Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా 'ఓటర్' ఫస్టులుక్ రిలీజ్!

  • విష్ణు హీరోగా రూపొందిన 'ఓటర్'
  • తమిళంలో టైటిల్ 'కురళ్ 388' 
  • ఈ సినిమాతోనే తమిళంలోకి విష్ణు ఎంట్రీ
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన పాత్ర 'ఓటర్' దే. అలాంటి ఓటర్ ఎన్నికల తరువాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. అప్పుడు ఓటర్ తిరగబడితే ఏమవుతుంది? ఓటర్ పవర్ ఏ స్థాయిలో ఉంటుంది? అనే కథాంశంతో మంచు విష్ణు కథానాయకుడిగా 'ఓటర్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ రోజున మంచు విష్ణు పుట్టినరోజు కావడం వలన, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'ఓటర్' ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

కేంద్ర .. రాష్ట్ర రాజకీయనాయకుల ముఖ చిత్రాల మధ్య విష్ణు ఒక ఓటర్ గా ఓటు వేసినట్టు తన వేలుకి గల ఇంకు మార్కును చూపిస్తూ ఆవేశంతో కనిపిస్తున్నాడు. టైటిల్ కి తగిన నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది. జి.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందుతోంది. తమిళంలో ఈ సినిమాకి 'కురళ్ 388' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళ తెరకి ఈ సినిమాతోనే విష్ణు పరిచయమవుతుండటం విశేషం. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాను, వచ్చేనెలలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.   
manchu vishnu
surabhi

More Telugu News