Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్ల పారితోషికం పెరగాలి .. నయనతారకి దక్కుతున్నదీ తక్కువే!: రకుల్ ప్రీత్ సింగ్

  • హీరోయిన్స్ కు ముడుతోన్న పారితోషికం తక్కువే
  • నయనతారకి దక్కుతున్నది తక్కువ పారితోషికమే 
  • నా శ్రమకి తగినట్టుగానే నేను తీసుకుంటున్నాను  
కథానాయకులతో పోలిస్తే .. వెండితెరపై కథానాయికలు మారిపోవడం చకచకా జరిగిపోతూ ఉంటుంది. అందువల్లనే వాళ్లు తమకి గల తక్కువ సమయంలోనే వివిధ భాషల్లో నటించడానికి ఆసక్తిని చూపుతుంటారు. ఇక పోటీ కూడా కథానాయికల మధ్యనే ఎక్కువగా ఉంటుంది. నిలదొక్కుకునేలోగానే ఆ స్థానంలోకి మరొకరు వచ్చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమిస్తూనే కొంతమంది కథానాయికలు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

అలాంటి కథానాయికల్లో కొంతమంది .. హీరోలతో పోలిస్తే తమకి వచ్చే పారితోషికం తక్కువనే ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే వున్నాయి. తాజాగా ఆ జాబితాలో రకుల్ కూడా చేరిపోయింది. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార అందుకుంటున్న పారితోషికం కూడా 3 కోట్లకి మించకపోవడం గురించి రకుల్ ప్రస్తావించింది. హీరోయిన్ల పారితోషికం పెరగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక తాను అందుకుంటోన్న పారితోషికం తన శ్రమకి తగినదనే  చెప్పుకొచ్చింది.       
rakul
nayanatara

More Telugu News