ఆరుగురు బాలికలపై ఆరు నెలలుగా లైంగిక దాడి.. 85 ఏళ్ల వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ షీటీమ్స్
- చాక్లెట్లు, డబ్బు ఆశ చూపి బాలికలపై అత్యాచారం
- నోట్ బుక్స్ తనిఖీతో వెలుగు చూసిన వృద్ధుడి పైశాచికం
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
గత కొన్ని రోజులుగా విద్యార్థినులు ముభావంగా కనిపించడం, హోం వర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయులు వారి నోటు పుస్తకాలను తనిఖీ చేయడంతో విషయం బయటపడింది. వారి పుస్తకాల్లోంచి వంద రూపాయల నోట్లు కనిపించడంతో వారి తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి ఆరా తీశారు.
సత్యనారాయణ తాత తమకు ఆ డబ్బులు ఇచ్చినట్టు చెప్పిన బాలికలు జరిగిన దారుణాన్ని వివరించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండడంతో కాలక్షేపం కోసమే వారిని పిలుస్తుండేవాడినని, అంతకుమించి వేరే ఉద్దేశం లేదని సత్యనారాయణరావు వివరించాడు.