Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగ్గురితోనూ డేటింగ్ కి వెళతా.. ముగ్గుర్నీ చంపేస్తా!: సల్మాన్ ఖాన్

  • దీపిక, జాక్వెలిన్, కత్రినాతో డేటింగ్ కి రెడీ
  • ఈ ముగ్గుర్లో ఎవరినీ పెళ్లి చేసుకోను
  • ముగ్గుర్నీ చంపేస్తాను
బిగ్ బాస్ సీజన్ 11లో పద్మావతి సందడి చేసింది. పద్మావతి సినిమా ప్రమోషన్ లో భాగంగా కంటెస్టెంట్స్ తో ఆటలు ఆడించిన దీపికా పదుకునే 'ఘూమర్' పాటకు స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సల్మాన్ తో సరదాగా 'డేటింగ్, మ్యారీ, కిల్' ఆట ఆడింది. ఈ సందర్భంగా సల్మాన్ ను దీపిక 'నేను, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కత్రినా కైఫ్ లలో ఎవరితో డేటింగ్ కు వెళ్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపేస్తావు?' అని అడిగింది.

దీనికి సల్మాన్ చెబుతూ... ముగ్గురితోనూ డేటింగ్ కు వెళ్తానని, అయితే ముగ్గుర్లో ఎవరినీ పెళ్లి చేసుకోనని, ముగ్గురినీ చంపేస్తానని చెప్పాడు. దీంతో దీపిక పెద్దగా నవ్వేసింది. ఇంతకీ సినిమాలో రణ్ వీర్ సింగ్ తో సీన్స్ లో ఎలా నటించావని అడిగాడు. దీనికి దీపికా సమాధానం చెబుతూ.. "రణ్ వీర్ తో ఇంతకు ముందు రెండు సినిమాల్లో నటించాను. 'రామ్ లీలా', 'బాజీరావ్ మస్తానీ' సినిమాల్లో మా ఇద్దరి మధ్య మంచి సన్నివేశాలు ఉన్నాయి. 'పద్మావతి' సినిమాలో మాత్రం మేమిద్దరం కలిసి నటించే అవకాశం రాలేదు" అని చెప్పింది.

అయితే, తనకు, షాహిద్ కపూర్ కి మధ్య సీన్స్ ఉన్నాయని చెప్పింది. దీంతో సల్మాన్ 'విన్నారా?... దీపికాకి, 'అల్లావుద్దీన్ ఖిల్జీ' పాత్రధారి రణ్ వీర్ సింగ్ కి మధ్య సన్నివేశాలు లేవు' అంటూ చెప్పాడు. ఇంక సమస్య తీరిపోయిందని అన్నాడు.
padmavathi
Salman Khan
deepika padukone

More Telugu News