చిల్లర్ అనే ప‌దంలో 'చిల్' ఉంది.. శ‌శిథ‌రూర్‌కి చుర‌క‌లంటించిన 'మిస్ వ‌ర‌ల్డ్‌' చిల్ల‌ర్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిల్లర్ అనే ప‌దంలో 'చిల్' ఉంది.. శ‌శిథ‌రూర్‌కి చుర‌క‌లంటించిన 'మిస్ వ‌ర‌ల్డ్‌' చిల్ల‌ర్‌!

  • మన చిల్లర్‌ ప్రపంచ సుందరి అయ్యింది అంటూ శ‌శిథ‌రూర్ ట్వీట్
  • ప్రపంచాన్ని గెలిచిన ఓ అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలకు కలత చెంద‌దు
  • ‘చిల్లర్‌’పై ఈ చర్చ ఓ చిన్న మార్పు మాత్రమే- మానుషీ చిల్లర్‌
'మన చిల్లర్‌ ప్రపంచ సుందరి అయ్యింది' అంటూ మానుషీ చిల్లర్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేసిన పెద్ద‌నోట్ల ర‌ద్దును ముడిపెడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య చేశారు. 17 ఏళ్ల త‌రువాత భార‌త్‌కు ప్ర‌పంచ సుంద‌రి కిరీటాన్ని తెచ్చిపెట్టిన చిల్ల‌ర్‌పై ఇటువంటి వ్యాఖ్య చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

శ‌శిథ‌రూర్ వ్యాఖ్య‌పై మానుషీ చిల్ల‌ర్ స్పందించింది. ప్రపంచాన్ని గెలిచిన ఓ అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలకు కలత చెందదని ఆమె పేర్కొంది. ‘చిల్లర్‌’పై ఈ చర్చ ఓ చిన్న మార్పు మాత్రమే అని కౌంట‌ర్ ఇచ్చింది. చిల్లర్ అనే ప‌దంలో 'చిల్‌' ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని చుర‌క‌లంటించింది. కాగా, తాను చేసిన వ్యాఖ్య‌పై వివాదం చెల‌రేగుతుండ‌డంతో శ‌శిథ‌రూర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. మానుషి అందానికి, తెలివితేటలకి, ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాప్ అని మ‌రో ట్వీట్ చేశారు. ఆమెను కించపరిచే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. తాను ఆ ట్వీట్‌ను సరదాగా చేసినట్లు పేర్కొన్నారు. 
shashi tharoor
manushi chillar
miss world

More Telugu News