ఆకట్టుకుంటున్న 'కణం' ట్రైలర్... నటనతో మరోసారి మెప్పించేందుకు సిద్ధమైన సాయి పల్లవి
- ఇదే సినిమాతో తమిళ సినిమాలో తెరంగేట్రం
- హీరోగా నాగశౌర్య
- ఇప్పటికే విడుదలైన ఎంసీఏ టీజర్
ఈ చిత్రం ద్వారా తమిళంలో సాయి పల్లవి ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్కడ ఈ సినిమా 'కరు' అనే పేరుతో విడుదలకాబోతుంది. ఈ రెండు భాషల ట్రైలర్లను నటుడు, దర్శకుడు ప్రభుదేవా విడుదల చేశారు. సాయి పల్లవి ప్రస్తుతం నాని సరసన నటిస్తోన్న 'ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)' టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.