ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి ప్రవేశించిన వ్యక్తి.. విమానం కొనడానికి వచ్చానని సమాధానం!
- చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన.. హై అలర్ట్
- పోలీసులకు అప్పగించిన విమానాశ్రయ సిబ్బంది
- అతడికి మతి స్థిమితం లేదని గుర్తించిన పోలీసులు
- విమానాశ్రయంలో భద్రత డొల్లతనం రుజువైందని విమర్శలు
అతడి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. అయితే, ఓ సాధారణ వ్యక్తి సునాయాసంగా విమానాశ్రయంలోకి ప్రవేశించడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయంలో భద్రత డొల్లతనం మరోసారి రుజువైందని విమర్శిస్తున్నారు. ఆ వ్యక్తి వీఐపీలు వెళ్లే గేట్ నుంచి రన్వేలోకి ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.