స్కాచ్ బాటిల్ పంపి నంది అవార్డు అడిగారు: ఆర్ట్ డైరెక్టర్ చంటి సంచలన కామెంట్
- తొలి సమావేశంలోనే చాయ్ బిస్కెట్లపై మాటలు
- తమకు వచ్చే కన్వీనియన్స్ పై చర్చలు
- 2013 అవార్డుల కమిటీ సభ్యుడు ఆర్ట్ డైరెక్టర్ చంటి కీలక వ్యాఖ్యలు
ఏంటండీ స్కాచ్ బాటిల్ పంపారని సదరు వ్యక్తిని అడిగితే, మిగతా వారంతా ఒప్పుకున్నారని, తన సినిమాకు అవార్డు వచ్చేలా చూడాలని ఆయన అడిగాడని అన్నారు. ఆ రోజు నుంచి తాను ఒక్క కమిటీ సమావేశానికి కూడా వెళ్లలేదని చెప్పుకొచ్చారు. సినిమాలు చూడకుండానే అవార్డుల జాబితా తయారు చేసినట్టు అనుమానం వస్తోందని అన్నారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు, ప్రభుత్వ ఉద్యోగులను, సంఘంలోని ఇతర వర్గాల ప్రముఖులను కూడా కమిటీలో భాగం చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు.