అక్కడ.. ఏకంగా ఏటీఎంనే లేపేశారు!
- రాజస్థాన్ లోని బుండీ నగరంలో ఏటీఎం చోరీ
- విద్యుత్ ఆపేసి, ఏటీఎంను ఎత్తుకెళ్లిపోయారు
- ఏటీఎంను ట్రాన్స్ పోర్ట్ వాహనంలో తరలించిన వైనం
తర్వాత ఏటీఎంను మోసుకుంటూ వెళ్లి, వంద మీటర్ల దూరంలోని ట్రాన్స్ పోర్టు వాహనంలోకి చేర్చారు. అనంతరం దానిని తీసుకెళ్లిపోయారు. ఆ ఏటీఎంలో నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల నగదు ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆ ఏటీఎంలో సెక్యూరిటీ కాంట్రాక్టు ముగియడంతో దానిని పునరుద్ధరించలేదు. దీనిని అవకాశంగా మలచుకున్న దొంగలు దోపిడీకి తెగబడ్డారు. కాగా, ఈ పరిసరాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించినా ఏటీఎం చోరీని గుర్తించకపొవడం విశేషం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.