గంట మోగించిన లక్ష్మణ్.. ఒక్క బంతి కూడా ఆడకుండానే మైదానాన్ని వీడిన ఆటగాళ్లు
- గతంలో ఈడెన్ లో భారీ ఇన్నింగ్స్ ఆడిన లక్ష్మణ్
- గత జ్ఞాపకాలకు గుర్తుగా నేడు స్టేడియంలో గంటను మోగించిన వీవీఎస్
- ఆటను మరోసారి అడ్డుకున్న వర్షం
2001లో ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో లక్ష్మణ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి 281 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆనాటి జ్ఞాపకాలకు గుర్తుగా నేడు స్టేడియంలోని గంటను మోగించాడు.
మరోవైపు ఆటను ప్రారంభించేందుకు శ్రీలంక ఆటగాళ్లతో పాటు టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లు మైదానంలోకి అడుగుపెట్టారు. అయితే, ఒక్క బంతి కూడా పడకముందే, వర్షపు జల్లు మొదలవడంతో, ఆటగాళ్లంతా మైదానాన్ని వీడారు. ఇప్పుడు మళ్లీ ఆట మొదలైంది.