రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ కు పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే..!

  • ఎలాంటివాడో తెలుసుకుని చేసుకోమన్న పవన్
  • ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రేణు వెల్లడి
  • పవన్ నన్ను గొప్ప తల్లిగా భావిస్తారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మరోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కు ఫోన్ చేసి, శుభాకాంక్షలు తెలిపానని పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలిపారు. తల్లీ, కుమారుడు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించానని చెప్పారు. రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్న తనకు పవన్ సూచనలు కూడా చేశారని తెలిపారు. చేసుకోబోయే వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకుని ముందడుగు వేయాలని చెప్పారని అన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

తమ పిల్లలు ఎవరి వద్ద ఉండాలనే విషయంపై చర్చ తమ మధ్య ఎన్నడూ రాలేదని రేణు తెలిపారు. ఒక భార్యగా, ఒక వ్యక్తిగా తనను పవన్ ఎలా గుర్తించారన్నది తనకు తెలియకపోయినా... పిల్లలకు ఒక తల్లిగా మాత్రం పవన్ తనను చాలా గొప్పగా భావిస్తారని అన్నారు.  
Go Back to Shorts
renu desai
Pawan Kalyan
renu desai second marriage
tollywood

More Telugu News